అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Police | నగరంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న మహిళను పోలీసులు (Police) అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి (SHO Raghupathi) వివరాలు వెల్లడించారు.
Nizamabad Police | బస్సు ఎక్కుతుండగా చోరీలు
నిజామాబాద్ రైల్వే స్టేషన్ (Nizamabad railway station) పరిధిలోని బస్టాప్ వద్ద బస్సులు ఎక్కుతున్న ప్రయాణికుల నుంచి బంగారు నగలు చోరీ చేస్తున్నట్లుగా అందిన సమాచారం మేరకు గట్టి నిఘా పెట్టామని ఎస్‌హెచ్‌వో తెలిపారు. ఈ క్రమంలో సీసీ కెమెరా పుటేజీలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. దర్యాప్తులో భాగంగా కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా దీన్‌దయాల్ నగర్‌కు చెందిన ఉపాధ్యాయ్ రాణిబాయిని నిందితురాలిగా గుర్తించి, అరెస్ట్ చేశామన్నారు. ఆమె వద్ద నుంచి మొత్తం 4 తులాలకు పైగా బంగారంను స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
