309
అక్షరటుడే, బాన్సువాడ: Banswada | రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామ (Kollur village) శివారులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ నుంచి బాన్సువాడ (Birkur To Banswada) వైపు వస్తున్న లేబర్ ఆటోను ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో బాన్సువాడ మండలం బుడ్మి గ్రామానికి చెందిన మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు క్షతగాత్రులను బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.