అక్షరటుడే, కోటగిరి: Kotagiri | అనారోగ్యం కారణంగా మనస్థాపంతో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పోతంగల్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సునీల్ (SI Sunil) తెలిపిన వివరాల ప్రకారం.. హంగర్గ గ్రామానికి చెందిన లక్ష్మి (38) భర్తకు మద్యానికి బానిసై పనిచేయకుండా తిరిగేవాడు.
అయితే సదరు మహిళ అనారోగ్యానికి గురైంది. అంతేకాకుండా కుటుంబ పోషణ సైతం భారం కావడంతో మనస్థాపానికి లోనైంది. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో మహిళ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
