Yellareddy | చోరీ కేసులో మహిళ అరెస్టు

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | చోరీ కేసులో మహిళను అరెస్ట్​ చేసినట్లు పోలీసులు(Police) తెలిపారు. సాతెల్లి గ్రామానికి చెందిన నీరడి మంజుల ఎల్లారెడ్డి పట్టణంలోని డైలీ మార్కెట్(Daily Market) సమీపంలో నగలు అమ్మేందుకు యత్నించగా బుధవారం పట్టుకున్నట్లు చెప్పారు. ఆమెను విచారించగా గతంలో పలు ఇళ్లలో చోరీలు చేసినట్లు ఒప్పుకుందన్నారు. సాతెల్లి గ్రామంలోని పసుపుల అనిత ఇంట్లో, దుద్దుల దుర్గయ్య, మంగలి కిషన్ ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ఆమెను అదుపులోకి తీసుకొని […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | చోరీ కేసులో మహిళను అరెస్ట్​ చేసినట్లు పోలీసులు(Police) తెలిపారు. సాతెల్లి గ్రామానికి చెందిన నీరడి మంజుల ఎల్లారెడ్డి పట్టణంలోని డైలీ మార్కెట్(Daily Market) సమీపంలో నగలు అమ్మేందుకు యత్నించగా బుధవారం పట్టుకున్నట్లు చెప్పారు. ఆమెను విచారించగా గతంలో పలు ఇళ్లలో చోరీలు చేసినట్లు ఒప్పుకుందన్నారు. సాతెల్లి గ్రామంలోని పసుపుల అనిత ఇంట్లో, దుద్దుల దుర్గయ్య, మంగలి కిషన్ ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ఆమెను అదుపులోకి తీసుకొని ఒక జత బంగారు కమ్మలు, 20 తులాల వెండి పట్టీలు, ఐదు తులాల వెండి కడియం, రూ.12,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మంజులను రిమాండ్​కు తరలించామని పోలీసులు తెలిపారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...