Jakkidi Shivacharan Reddy | యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు రిజర్వేషన్ల కోసం కృషి చేస్తా

అక్షరటుడే, బాన్సువాడ: Jakkidi Shivacharan Reddy | స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ సభ్యులకు 25 శాతం సీట్లు కేటాయించే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి(Jakkidi Shivacharan Reddy) అన్నారు. పట్టణంలోని శ్రీనివాస గార్డెన్(Srinivasa Garden) లో జిల్లా స్థాయి యూత్ కాంగ్రెస్ కార్యకర్తల సమీక్షా సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. Jakkidi Shivacharan Reddy | ప్రభుత్వ పథకాలు ప్రతిఇంటికీ చేరాలి.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress […]

అక్షరటుడే, బాన్సువాడ: Jakkidi Shivacharan Reddy | స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ సభ్యులకు 25 శాతం సీట్లు కేటాయించే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి(Jakkidi Shivacharan Reddy) అన్నారు. పట్టణంలోని శ్రీనివాస గార్డెన్(Srinivasa Garden) లో జిల్లా స్థాయి యూత్ కాంగ్రెస్ కార్యకర్తల సమీక్షా సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.

Jakkidi Shivacharan Reddy | ప్రభుత్వ పథకాలు ప్రతిఇంటికీ చేరాలి..

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ప్రవేశ పెట్టిన పథకాలను గ్రామీణ స్థాయిలో ప్రతి ఇంటికి చేరే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం18 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రూపు రాజకీయాలు పక్కనపెట్టి అందరూ కలిసిమెలిసి పనిచేయాలని సూచించారు. అంతకుముందు మాజీ డీసీసీబీ ఛైర్మన్​ పోచారం భాస్కర్​రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు ఏకగ్రీవం అయ్యేవిధంగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ అమృత, కాసుల రోహిత్, పీసిసి డెలిగేట్ రాజిరెడ్డి, మన్సుర్, శ్రీనివాస్, సర్దార్, దుర్గం శ్యామల, అలిబిన్, సురేష్ బాబా, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...