MP Suresh Shetkar | కార్యకర్తలకు అండగా ఉంటా: ఎంపీ సురేశ్​ షెట్కార్

అక్షరటుడే, బాన్సువాడ: MP Suresh Shetkar | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజమైన కార్యకర్తలకు అండగా నిలుస్తానని జహీరాబాద్ ఎంపీ సురేశ్​ షెట్కార్​ (Zaheerabad MP Suresh Shetkar) పేర్కొన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రుద్రూర్ మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి శుక్రవారం ఎంపీని కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో (MP elections) కష్టపడి శ్రమించిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు, సముచిత స్థానం కల్పిస్తామని […]

అక్షరటుడే, బాన్సువాడ: MP Suresh Shetkar | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజమైన కార్యకర్తలకు అండగా నిలుస్తానని జహీరాబాద్ ఎంపీ సురేశ్​ షెట్కార్​ (Zaheerabad MP Suresh Shetkar) పేర్కొన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రుద్రూర్ మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి శుక్రవారం ఎంపీని కలిశారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో (MP elections) కష్టపడి శ్రమించిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు, సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బాన్సువాడ నియోజకవర్గంలో (Banswada constituency) నిబద్ధత కలిగిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని, ఎవరికీ టికెట్ వచ్చినా తాము పార్టీ కోసం పనిచేయడమే ధ్యేయమని చంద్రశేఖర్, రాజారెడ్డి ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. అలాంటి నిస్వార్థ కార్యకర్తలను కాపాడాలని వారు కోరారు. పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను ఆదుకోవడం తన బాధ్యతగా భావిస్తానని ఎంపీ సురేశ్​ షెట్కార్​ తెలిపారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...