అక్షరటుడే, వెబ్‌డెస్క్: Medaram Jathara | మేడారం మహాజాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జాతర సాగనుంది.
తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు (Medaram Jathara) ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లు (special trains) నడపాలని ప్రజలు కోరుతున్నారు. ఆదిలాబాద్ నుంచి వరంగల్‌కు మజ్రీకధాన్-బల్హర్‌షా, నిజామాబాద్ నుంచి వరంగల్ మీదుగా పెద్దపల్లి, సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు ప్రత్యేక రైళ్లు నడపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Medaram Jathara | ఆ స్టేషన్లకు..
మేడారంలో రైల్వే స్టేషన్ లేదు. అయితే వరంగల్, కాజీపేట, మహబూబాబాద్ రైల్వేస్టేషన్ల వరకు ప్రత్యేక రైలు సౌకర్యం కల్పిస్తే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అక్కడి వరకు వస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులు (special buses) ఏర్పాటు చేస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి ఆయా స్టేషన్లకు స్పెషల్ ట్రైన్స్ వేయాలని భక్తులు కోరుతున్నారు.
Medaram Jathara | ఆర్టీసీ చర్యలు
మేడారం జాతర నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రత్యేక బస్సులు నడుపనుంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల నుంచి మేడారం బస్సులు నడవనున్నాయి. వీటిలో అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. అయితే రైల్వే అధికారులు సైతం జాతర రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రజలు కోరుతున్నారు.
Medaram Jathara | ఆ రైళ్లలో అధిక రద్దీ
మేడారం జాతరకు స్పెషల్ ట్రైన్లు లేకపోవడంతో.. నిత్యం నడిచే రైళ్లపైనే భక్తులు ఆధారపడుతున్నాయి. అయితే నాలుగు రోజుల పాటు జరిగే జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. వీరికి ఇప్పుడు నడిచే రైళ్లు ఎటు సరిపోవు. దీంతో రైళ్లలో రద్దీతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తే రైల్వేకు ఆదాయంతో పాటు భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. కాగా గతంలో పలుమార్లు జాతర కోసం రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడిపారు. ప్రస్తుతం జాతర సమీపిస్తున్న ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.