Homeఆంధప్రదేశ్Pawan Kalyan | పవన్​ కల్యాణ్​ సారీ చెబుతారా.. మరోసారి ఫైర్​ అయిన జడ్చర్ల ఎమ్మెల్యే

Pawan Kalyan | పవన్​ కల్యాణ్​ సారీ చెబుతారా.. మరోసారి ఫైర్​ అయిన జడ్చర్ల ఎమ్మెల్యే

తెలంగాణ ప్రజలపై ఇటీవల పవన్​ కల్యాణ్​ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. అన్ని పార్టీల నాయకులు పవన్​ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pawan Kalyan | తెలంగాణ ప్రజలపై ఇటీవల పవన్​ కల్యాణ్​ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. తెలంగాణలోని అన్ని పార్టీల నాయకులు పవన్​ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేస్తున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ ఇటీవల కోనసీమలో పర్యటించారు. ఆ సమయంలో తెలంగాణ వాళ్ల నరదిష్టి తగిలి కొబ్బరి చెట్లు ఎండిపోయాయని వ్యాఖ్యలు చేశారు. దీనిపై తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ నాయకులు (BRS Leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్​ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన సినిమాలు ఆడనివ్వమని సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి (Komatireddy Venkat Reddy) హెచ్చరించారు. అయినా పవన్​ కల్యాణ్​ ఇప్పటి వరకు తన వ్యాఖ్యలపై స్పందించలేదు.

Pawan Kalyan | సినిమాలు ఆడనివ్వం

పవన్​ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా.. ఆయన ఇంతవరకు క్షమాపణ చెప్పలేదు. కానీ పార్టీ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. రాజోలు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారని పేర్కొంది. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్న క్రమంలో ఆ మాటలు వక్రీకరించవద్దని జనసేన కోరింది. అయితే పవన్​ క్షమాపణ చెప్పాలని తెలంగాణ నాయకులు (Telangana Leaders) డిమాండ్​ చేస్తున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి (MLA Anirudh Reddy) మరోసారి పవన్​పై ఫైర్​ అయ్యారు. ఇప్పటి వరకు ఎందుకు క్షమాపణ చెప్పలేదని ప్రశ్నించారు. సారీ చెప్పే వరకు జడ్చర్లలో ఆయన సినిమా ఆడనిచ్చేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను రాక్షసులతో పోల్చడం సరికాదన్నారు.

Pawan Kalyan | బర్తరఫ్​ చేయాలి

పవన్​ కల్యాణ్​ను బర్తరఫ్​ చేయాలని సీపీఐ నారాయణ (CPI Narayana) డిమాండ్​ చేశారు. ఆయన మాటలతో తెలుగు ప్రజల ఐక్యత దెబ్బతినే ప్రమాదముందన్నారు. ఓసారి చేగువేరా అన్నాడు.. మరోసారి సావర్కర్ శిష్యుడు అన్నాడని విమర్శించారు. డిప్యూటీ సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

Must Read
Related News