అక్షరటుడే, వెబ్డెస్క్ : Guntur | ప్రియుడితో కలిసి భర్తను చంపిందో భార్య. అనంతరం కనీసం భయం లేకుండా.. రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
దేశంలో ఇటీవల వివాహేతర సంబంధాలు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. ప్రియుడి మోజులో భార్యలు కట్టుకున్న వాడిని కడతేరుస్తున్నారు. మరోవైపు అనుమానంతో భర్తలు భార్యలను హత్య చేస్తున్నారు. ఇటీవల ఎలాంటి ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం (Duggirala Mandal) చిలువూరులో ఓ మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది. అనంతరం గుండెపోటుతో చనిపోయినట్లు నాటకం ఆడింది.
Guntur | వ్యాపారం మాన్పించి..
చిలువూరు (Chiluvuru)కు చెందిన శివనాగరాజు(45), లక్ష్మీ మాధురికి 2007లో పెళ్లి జరిగింది. శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మాధురి విజయవాడ (Vijayawada)లోని ఓ సినిమా థియేటర్‌లో గతంలో పని చేసింది. ఈ సమయంలో సత్తెనపల్లికి చెందిన గోపి అనే వ్యక్తితో ఆమెకు పరిచడం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. గోపి హైదరాబాద్ (Hyderabad)లో ట్రావెల్స్ నడిపేవాడు. దీంతో తాము కలిసి ఉండటానికి మాధురి తన భర్తతో వ్యాపారి మాన్పించింది. గోపి దగ్గర శివనాగరాజును డ్రైవర్గా పంపింది. దీంతో కుటుంబాన్ని హైదరాబాద్కు మార్చాడు. అనంతరం లక్ష్మి, గోపి తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. అయితే ఈ విషయం శివనాగరాజుకు తెలియడంతో భార్యను మందలించాడు. భార్యను తీసుకొని స్వగ్రామానికి వెళ్లిపోయాడు.
Guntur | నిద్రమాత్రలు కలిపి..
గోపితో మాట్లడొద్దని భర్త లక్ష్మి మాధురిని హెచ్చరించాడు. అయితే ఆమె అతడితో సంబంధం కొనసాగించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసిన లక్ష్మి మాధురి బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి భర్తకు పెట్టింది. శివనాగరాజు నిద్రపోయిన తర్వాత ప్రియుడితో కలిసి ముఖంపై దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఈ ఘటన జనవరి 18న రాత్రి చోటు చేసుకుంది.
Guntur | గుండెపోటుగా నాటకం
హత్య అనంతరం ప్రియుడు గోపి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే లక్ష్మి మాధురి మాత్రం భర్త మృతదేహాన్ని పక్కన పెట్టుకొని ఫోన్లో రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది. అనంతరం తెల్లవారుజామున తన భర్త గుండెపోటుతో చనిపోయాడని నాటకం ఆడింది. అయితే మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దీంతో ప్రియుడితో కలిసి తానే హత్య చేసినట్లు లక్ష్మి మాధురి ఒప్పుకుంది. ఈ మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.