అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nandyal : మహిళలు సున్నిత మనస్కులు అనేది పాత నానుడి.. వారు అనుకున్నది చేయడానికి ఎంత కఠినంగానైనా మారతారనేది నేటి ఒరవడి.. పెళ్లికి ముందే ప్రియుడితో సంబంధం, పెళ్లి తర్వాత వివాహేతర సంబంధం కారణం ఏదైనా.. భర్తలను కడతేర్చుతున్నారు భార్యలు. ఇటీవల రోజుకో ఘటన వెలుగుచూస్తోంది.
ఇలాంటి వార్తలు వింటుంటే పెళ్లంటే భయపడిపోతున్నారు యువకులు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఆమెతో సంసారం చేయాలంటే కూడా ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న టెన్షన్ కొందరిలో ఉంటోంది. తాజాగా భార్య (Wife) చేతిలో మరో అమాయకుడు బలి అయ్యాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నంద్యాలలో చోటుచేసుకుంది.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. భర్తను చంపిన భార్య, అతడి మృతదేహాన్ని ఇంటికి పార్సిల్ parcel చేసి మరీ వెళ్లింది ఈ కఠినాత్మురాలు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.
నంద్యాల జిల్లాలోని నూనెపల్లికి చెందిన రమణకు పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా, గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రమణమ్మ తన పుట్టింటికి వెళ్లిపోయింది.
రమణమ్మ తన మనసు మార్చుకుని మెట్టింటికి వస్తుందేమో అని ఆశగా ఎదురుచూసిన రమణకు నిరాశే ఎదురైంది. దీంతో ఆమెను నచ్చజెప్పి ఇంటికి తెచ్చుకోవాలని అనుకున్నాడు. వెంటనే రమణమ్మ పుట్టింటికి వెళ్లాడు.
కానీ, జరిగింది వేరు. ఇంటికి వచ్చిన అల్లుడిని గౌరవించడం పక్కనుంచి కనీస మర్యాద కూడా ఇవ్వలేదు. పైపెచ్చు రమణమ్మ కుటుంబ సభ్యులు గొడవకు దిగి దాడి చేశారు.
Nandyal : కళ్లలో కారం చల్లి దాడి..
రమణ కళ్లలో కారం చల్లి దారుణంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన రమణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతడి మృతదేహాన్ని నిందితులు నంద్యాలలోని రమణ ఇంటి వద్దకు తీసుకొచ్చి, అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు Police ఘటనాస్థలికి చేరుకున్నారు. వివరాలు సేకరించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.