Homeజిల్లాలుకామారెడ్డిShabbir Ali | వరదలు ముంచెత్తిన నెల రోజుల తర్వాత పరామర్శలా..: షబ్బీర్​ అలీ

Shabbir Ali | వరదలు ముంచెత్తిన నెల రోజుల తర్వాత పరామర్శలా..: షబ్బీర్​ అలీ

వరద కష్టాల్లో ప్రజలు ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా ఈ పక్కకు రాని షరీష్​ రావు నెలరోజుల తర్వాత పరామర్శకు రావడం ఎంత వరకు సమంజసమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ విమర్శించారు. హరీష్​ రావు జిల్లా పర్యటన సందర్భంగా ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | కామారెడ్డి జిల్లా ప్రజలు వరదలతో అల్లాడితే నెలరోజుల తర్వాత తీరిగ్గా వచ్చి పరామర్శిస్తారా.. అంటూ మాజీ మంత్రి హరీశ్​​ రావును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ ప్రశ్నించారు. హరీష్ రావు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వరద బాధితులను పరామర్శించడాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

Shabbir Ali | ప్రకృతి విపత్తుపై రాజకీయాలా..?

ప్రకృతి విపత్తుపై రాజకీయం చేయడం సిగ్గుచేటని షబ్బీర్​ అలీ విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో వర్షాలు, వడగళ్ల వానలతో ఎన్నోసార్లు పంట నష్టం జరిగినా ఏ ఒక్కసారి కూడా రైతులను ఆదుకోలేదన్నారు. ప్రస్తుతం హరీష్ రావు (Harish Rao) ఇక్కడి ప్రజలపై ప్రేమతో రాలేదని, స్థానిక ఎన్నికల్లో పరువు కాపాడుకోవడానికి వచ్చారని విమర్శించారు. కుటుంబ సమస్యల నుంచి తేరుకొని బాధితులను పరామర్శించడానికి నెల రోజులు పట్టిందని ఎద్దేవా చేశారు. నాడు ప్రజల నివాసాలు నీళ్లలో కొట్టుకుపోయి హాహాకారాలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders), కార్యకర్తలు ఎటుపోయారని ప్రశ్నించారు.

వర్షాల్లో ప్రమాదమని తెలిసి కూడా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హెలికాప్టర్​లో ముంపు ప్రాంతాలు పరిశీలించడానికి వచ్చారని పేర్కొన్నారు. వాతావరణం అనుకూలించక ప్రజలను పరామర్శించలేకపోయారన్నారు. తిరిగి రెండు రోజుల్లో వచ్చి నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి కుటుంబాలకు తక్షణ సహాయం కింద రూ.11వేలు, చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు అందించారని గుర్తు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ నిర్వహించి అధికారులను సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారని, అధికారుల నివేదికను కేంద్రానికి పంపించారన్నారు.

Shabbir Ali | కేంద్రం నుంచి సాయం అందలేదు..

రాష్ట్ర ప్రభుత్వం నుండి చేయాల్సిందంతా చేస్తున్నారని, కేంద్రం నుండి ఇప్పటివరకు ఎలాంటి సహాయం అందలేదని షబ్బీర్​ అలీ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని (BRS Party) ప్రజలు మర్చిపోయే రోజులు వచ్చాయన్నారు. వారి హయాంలో దోపిడీ తప్ప రైతులకు, ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజలకు అనేక పథకాలను చేరువ చేస్తున్నామని వివరించారు. బీఆర్ఎస్ ది మాటల ప్రభుత్వమని.. తమది చేతల ప్రభుత్వమన్నారు.

బీఆర్​ఎస్​ నేతలు బయటకేమో కేంద్రాన్ని విమర్శిస్తారని.. లోపల నుంచి బీజేపీకి సాయం అందిస్తుంటారని విమర్శించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో (Vice Presidential election) కూడా బీజేపీకి సహాయపడ్డారన్నారు. వారి ప్రతి బిల్లుకు పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతు తెలిపారన్నారు. ప్రజలందరికీ ఈ విషయం తెలిసే బీఆర్​ఎస్​ను ఓడించారని వ్యాఖ్యానించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందని జ్యోస్యం చెప్పారు.