Home » Sarpanch elections | సర్పంచ్ ఎన్నికలని బీఆర్ఎస్ ‘లైట్’ తీసుకుందా.. కాంగ్రెస్‌లో ఫుల్ జోష్.. హీటెక్కిన‌ తెలంగాణ రాజకీయాలు

Sarpanch elections | సర్పంచ్ ఎన్నికలని బీఆర్ఎస్ ‘లైట్’ తీసుకుందా.. కాంగ్రెస్‌లో ఫుల్ జోష్.. హీటెక్కిన‌ తెలంగాణ రాజకీయాలు

by tinnu
0 comments
Sarpanch elections

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sarpanch elections | తెలంగాణలో పంచాయతీ ఎన్నికల (Panchayat elections) వేళ రాజకీయ హీట్‌ పెరిగిపోతోంది. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తి ఫోకస్ పెట్టగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం ఈసారి “లైట్ తీసుకుందా?” అన్న చర్చ గులాబీ దళంలోనూ, రాజకీయ వర్గాల్లోనూ వినిపిస్తోంది.

బీఆర్ఎస్ నాయకుల మాటల్లో చెప్పాలంటే .. పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills by-election) ఓటమి తర్వాత క్యాడర్ మోరల్ డౌన్ అయింది. బలపరిచిన అభ్యర్థులను గెలిపించినా, వారు తర్వాత పార్టీలోనే ఉంటారో? కాంగ్రెస్‌లోకి జంప్ అవుతారో? అనే సందేహం ఉంది. ఫండింగ్ విషయంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లకు భారీ భారమే కాబ‌ట్టి ఈ కారణాల వల్లే బీఆర్ఎస్ ఈసారి సర్పంచ్ ఎన్నికలపై అంతగా యాక్టివ్‌గా లేనట్లు తెలుస్తోంది.

Sarpanch elections | ఇక రేవంత్ రెడ్డి మాత్రం ఫుల్ స్పీడ్!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) ఇప్పటికే జిల్లాల టూర్‌లో దూసుకుపోతున్నారు. ప్రతి జిల్లాలో అభివృద్ధి పనులను ప్రారంభించడం, కొత్త నిధులను మంజూరు చేయడం, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని స్పష్టమైన దిశానిర్దేశం, దీంతో కాంగ్రెస్ క్యాడర్ ఉత్సాహంగా పనిచేస్తుండగా, బీఆర్ఎస్ మౌనంగా ఉండటం రాజకీయంగా పెద్ద చర్చగా మారింది.

అయితే సర్పంచ్ ఎన్నికలను (Sarpanch elections) బీఆర్ఎస్ ఎందుకు లైట్ తీసుకుంటోంది అంటే బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రధాన కారణాలు ఇవి.. చాలా చోట్ల బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఆకర్షించారనే ఆరోపణలు ఉన్నాయి. గెలిపించినా చివర్లో హస్తం గూటికే వెళ్లిపోతారు” అనే అభిప్రాయం బేఖాతరు చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఫండింగ్ పెద్ద సమస్యగా మారింది. 2028 అసెంబ్లీ ఎన్నికలు ప్రధాన లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాలు రూపొందిస్తోందని తెలుస్తోంది.
సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తు లేకుండా జరుగుతాయి కాబట్టి ప్రస్తుతం పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని భావించినట్లు సమాచారం. తెలంగాణ భవన్ (Telangana Bhavan) సమచారం ప్రకారం .. కొద్ది నియోజకవర్గాల్లో మాత్రమే పార్టీ నేతలు సర్పంచ్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటున్నారు.మిగతా ప్రాంతాల్లో… “ఎన్నికలు ఎలాగూ అధికార పార్టీదే బలం” అన్న భావనతో కేవలం యథావిధిగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

You may also like