అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : PCC Chief | అందరికీ దేవుడైన శ్రీరాముడిని వాడుకునే హక్కు బీజేపీకి ఎవరిచ్చారని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. ఈ మేరకు సోమవారం నిజామాబాద్ (Nizamabad) నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో (Congress Party Office) విలేకరుల సమావేశం నిర్వహించారు.
PCC Chief | రాముడేమైనా బీజేపీలో సభ్యత్వం తీసుకున్నారా..?
కులం, మతం పేరిట బీజేపీ ఎన్నికల్లో రాజకీయాలు చేస్తోందని పీసీసీ చీఫ్ విమర్శించారు. ఎన్నికలొస్తే చాలు.. దేవుళ్ల పేరు చెప్పుకుంటూ తిరుగుతారని పేర్కొన్నారు. రాముడేమైనా బీజేపీలో సభ్యత్వం తీసుకున్నారా.. అని ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే బీజేపీ (BJP) మతం పేరిట రాముడి పేరిట ఓట్లడుగుతూ లబ్ది పొందాలనుకోవడం శోచనీయనన్నారు. దేవుడి పేరిట ఓట్లడిగే వారికి ప్రజలు బుద్ది చెప్పాలన్నారు. దేవుడి పేరిట కాకుండా 12ఏళ్లలో చేసిన అభివృద్ధి గురించి చెప్పి బీజేపీ ఓట్లు అడగాలని సలహా ఇచ్చారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నుడా ఛైర్మన్ కేశ వేణు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, సీనియర్ నాయకులు దాసరి నర్సింలు, నరాల రత్నాకర్, వినయ్ రెడ్డి, జావిద్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.