Homeతాజావార్తలుRajasingh | జూబ్లీహిల్స్​లో ఏ పార్టీని గెలిపిస్తారు.. కేంద్రమంత్రి కిషన్​రెడ్డిపై రాజాసింగ్​ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajasingh | జూబ్లీహిల్స్​లో ఏ పార్టీని గెలిపిస్తారు.. కేంద్రమంత్రి కిషన్​రెడ్డిపై రాజాసింగ్​ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajasingh | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల వేళ కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ను గెలిపిస్తారా.. కాంగ్రెస్​ను గెలిపిస్తారా అని ప్రశ్నించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajasingh | గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ మరోసారి కేంద్రమంత్రి కిషన్​రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారని ఎద్దేవా చేశారు.
రాజాసింగ్​ కొంతకాలంగా కిషన్​రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

బీజేపీ(BJP)కి రాజీనామా చేసినా.. ఆయన కేంద్ర మంత్రిపై మాత్రం విమర్శలు ఆపడం లేదు. తెలంగాణలో బీజేపీ బలపడకపోవడానికి కిషన్​రెడ్డి (Kishan Reddy)కారణమని ఆయన గతంలో ఆరోపించారు. రాష్ట్ర కమిటీ ఏర్పాటు విషయంలో సైతం విమర్శలు చేశారు. తాజాగా జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల నేపథ్యంలో మరోసారి రాజాసింగ్​ తన మాటల తూటలు వదిలారు.

Rajasingh | ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక(Jubilee Hills By Election) త్వరలో జరగనుంది. ఇప్పటికే బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ అభ్యర్థులను ప్రకటించాయి. క్షేత్ర స్థాయిలో ప్రచారం సైతం ప్రారంభించాయి. అయితే బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. మరోవైపు ప్రచారంలో సైతం వెనకబడిపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాజాసింగ్(Rajasingh)​ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారని కిషన్​రెడ్డిని ప్రశ్నించారు. ఈ విషయం జూబ్లీహిల్స్ ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ని గెలిపిస్తారా, కాంగ్రెస్‌ని గెలిపిస్తారా అని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుందన్నారు. కిషన్​రెడ్డి గౌరవం ప్రమాదంలో ఉందని వ్యాఖ్యలు చేశారు.

Rajasingh | ముఖం ఎలా చూపెడతారు..

ఉప ఎన్నికల్లో భారీ ఓట్ల తేడాతో ఓడిపోతే కేంద్ర అధికారులకు ముఖం ఎలా చూపెడతారని కిషన్​రెడ్డిని ప్రశ్నించారు.‘‘నా జిల్లాను నాశనం చేసి నన్ను బయటికి పంపించారు మీరు కూడా ఏదో ఒక రోజు బయటకు వెళ్లారని” రాజాసింగ్ అన్నారు. అంతేగాకుండా కిషన్​రెడ్డికి, ఒవైసీకి మధ్య ఒప్పందం వల్లే ఎంఐఎం అభ్యర్థిని నిలపడం లేదా అని ఆయన ప్రశ్నించారు.