అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hero Prabhas | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు చెప్పగానే అభిమానులలో ఉత్సాహం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈశ్వర్ సినిమాతో హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రభాస్, ఛత్రపతి, డార్లింగ్, మిర్చి వంటి హిట్ చిత్రాలతో స్టార్‌గా ఎదిగారు.
ఆ తర్వాత బాహుబలి సిరీస్‌తో ఆయన కెరీర్ పూర్తిగా కొత్త మలుపు తిరిగింది. ఈ రెండు భాగాలు ఘనవిజయంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారి, దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించే ప్రతి సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్, సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదలైన ది రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Hero Prabhas | ప్రభాస్‌ను ‘అన్న’ అనే హీరోయిన్ ఎవరంటే..
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ స్పందన వస్తుండటం ప్రభాస్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ అభిమానులకే పరిమితం కాదు. సినిమా పరిశ్రమలోని పలువురు సెలబ్రిటీలు, ముఖ్యంగా హీరోయిన్లు కూడా ఆయనను ఎంతో అభిమానిస్తుంటారు. చాలా మంది నటీమణులు ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశపడుతుంటారు. అయితే ఈ జాబితాలో ఒక హీరోయిన్ మాత్రం అందరికీ భిన్నంగా ప్రభాస్‌ను ‘అన్న’ అని పిలిచి అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు… జాతిరత్నాలు సినిమాతో వెండితెరకు పరిచయమైన ఫరియా అబ్దుల్లా (Faria Abdullah). తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫరియా, ఆ తర్వాత పలు చిత్రాల్లో నటిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే గతంలో ఆమె ఓ బుల్లితెర కార్యక్రమానికి హాజరైనప్పుడు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆ కార్యక్రమంలో యాంకర్లు శ్రీముఖి (Anchor Srimukhi), ఆటో రాంప్రసాద్ “మీకు ఇష్టమైన హీరో ఎవరు?” అని ప్రశ్నించగా, ఫరియా ఏమాత్రం సంకోచం లేకుండా “ప్రభాస్ అన్న” అని సమాధానం చెప్పింది. ఈ సమాధానానికి శ్రీముఖి షాక్ అవుతూ, “నీకు ప్రభాస్ అన్న… నాకు జస్ట్ ప్రభాస్” అంటూ సరదాగా కామెంట్ చేయడం అప్పట్లో ప్రేక్షకులను బాగా నవ్వించింది. ఫరియా అబ్దుల్లా చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో (Social Media) విస్తృతంగా చర్చకు దారి తీశాయి. ప్రభాస్ క్రేజ్‌ను మరోసారి రుజువు చేసేలా ఈ సంఘటన మారింది. జాతిరత్నాలు తర్వాత ఫరియా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ, తొలి సినిమా ఇచ్చిన స్థాయి క్రేజ్ మాత్రం ఇంకా రాలేదనే అభిప్రాయం ఉంది. ప్రస్తుతం ఆమె సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తూ, కొత్త అవకాశాలపై ఆశలు పెట్టుకుంది.