Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | ఊరికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల.. భారీగా సొత్తు చోరీ..

Kamareddy | ఊరికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల.. భారీగా సొత్తు చోరీ..

బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్లయ్యింది. ఇంట్లో భారీగా సొత్తు చోరీకి గురైంది. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలోని సైలాన్ బాబా కాలనీలో మంగళవారం వెలుగుచూసింది.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్లయ్యింది. ఇంట్లో భారీగా సొత్తు చోరీకి గురైంది. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలోని సైలాన్ బాబా కాలనీలో (Sailan Baba Colony) మంగళవారం వెలుగుచూసింది.

బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. కాలనీలో నివసించే మహమ్మద్ వహీద్ తన బంధువుల ఇంటికి సిద్దిపేటకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డట్టు గుర్తించాడు. దొంగలు తాళాలను పగులగొట్టి 7 తులాల బంగారం, 80 తులాల వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. దీంతో ఆందోళనకు గురైన బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

Kamareddy | క్లూస్​ టీం రాక..

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్​టీం సిబ్బంది వేలిముద్రలను సేకరించారు. బాధితుడు వహీద్ మాట్లాడుతూ.. తమ బంధువుల ఊరైన సిద్దిపేటకు (Siddipet) వెళ్లి తిరిగి వచ్చేసరికి దొంగలు తమ ఇంటి తాళాలను పగులగొట్టారన్నారు. ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్​ను ఓపెన్ చేసి వెళ్లారని బాధితుడు వాపోయాడు. బీరువాలో దాచిన బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి క్లూస్​టీం సిబ్బందితో వేలిముద్రలను సేకరించి కాలనీలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు కామారెడ్డి పట్టణ సీఐ నరహరి (CI Narahari) తెలిపారు.

Must Read
Related News