Homeక్రైంCoimbatore | ప్రాణం తీసిన వాట్సాప్​ స్టేటస్​.. భార్యను హత్య చేసిన భర్త

Coimbatore | ప్రాణం తీసిన వాట్సాప్​ స్టేటస్​.. భార్యను హత్య చేసిన భర్త

తమిళనాడులోని కోయంబత్తూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి, ఆ ఫొటోను వాట్సాప్​ స్టేటస్​ పెట్టుకున్నాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coimbatore | సమాజంలో నేర ప్రవృత్తి పెరుగుతోంది. చిన్న చిన్న కారణాలలో కొందరు హత్యలు చేస్తున్నారు. కావాల్సిన వారిని సైతం అంతమొందిస్తున్నారు. పైగా తాము గొప్ప పని చేసినట్లు సోషల్​ మీడియా (Social Media)లో పోస్టులు పెడుతున్నారు.

ఓ వ్యక్తి తన భార్యను చంపి వాట్సాప్​ స్టేటస్​ పెట్టుకున్నారు.తమిళనాడులోని కోయంబత్తూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. తిరునెల్వేలి (Tirunelveli) ప్రాంతానికి చెందిన బాలమురుగన్, శ్రీప్రియ దంపతులు. భర్తతో విభేదాలు ఉండటంతో శ్రీప్రియ హాస్టల్​లో ఉంటుంది. బాలమురుగన్ ఆదివారం మధ్యాహ్నం శ్రీప్రియను కలవడానికి హాస్టల్‌కు వచ్చాడు. ఎవరూ గమనించకుండా తన దుస్తులలో కొడవలిని దాచిపెట్టాడు. ఇద్దరు కలిసిన వెంటనే వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బాలమురుగన్ కొడవలి తీసుకుని శ్రీప్రియను నరికి చంపాడు. మృతదేహంతో సెల్ఫీ కూడా తీసుకుని దానిని తన వాట్సాప్ స్టేటస్‌ (WhatsApp Status)గా అప్‌లోడ్ చేశాడు. ద్రోహానికి మరణమే సమాధానం అని స్టేటస్‌ పెట్టాడు.

Coimbatore | వాట్సాప్​ స్టేటస్​ చూసి..

ప్రైవేట్​ జాబ్​ చేస్తున్న శ్రీప్రియకు భర్త బంధువు ఇసక్కి రాజాతో శ్రీప్రియకు పరిచయం ఏర్పడింది. శ్రీప్రియతో దిగిన ఫొటోను వాట్సాప్​ స్టేటస్​ పెట్టాడు. అతడితో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని మురుగన్​ అనుమానించేవాడు. ఈ క్రమంలో వాట్సాప్​ స్టేటస్​ చూడగానే కోపంతో హాస్టల్​కు వెళ్లి భార్యను తన వెంట రమ్మని కోరాడు. ఆమె నిరాకరించడంతో హత్య చేశాడు. దాడి తర్వాత హాస్టల్ నివాసితులు భయంతో బయటకు పరుగులు తీశారు. బాలమురుగన్ సంఘటన స్థలంలోనే పోలీసులు వచ్చే వరకు ఉన్నాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Must Read
Related News