Homeటెక్నాలజీWhatsApp | వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచ‌ర్.. గ్రూపు చాట్‌లో ఇక మెసేజ్ టైప్ చేయ‌న‌క్క‌ర్లేదు.. మాట్లాడితే...

WhatsApp | వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచ‌ర్.. గ్రూపు చాట్‌లో ఇక మెసేజ్ టైప్ చేయ‌న‌క్క‌ర్లేదు.. మాట్లాడితే చాలు..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: WhatsApp | ఈ రోజుల్లో చాలా మంది వాట్సాప్‌తో (Whatsapp) ఎక్కువ స‌మ‌యం గడుపుతున్నారు. న‌లుగురికి స‌మాచారం చేర‌వేయాలంటే వాట్సాప్‌నే ఆశ్ర‌యిస్తున్నారు. మీరు ఏ మెసేంజర్ ఎక్కువ‌గా వినియోగిస్తున్నారని ఎవరినైనా అడిగితే ఎక్కువ శాతం మంది వాట్సాప్‌ అనే చెబుతారు. ఎందుకంటే వాట్సాప్‌ అంత పాపులర్‌. భారత్‌(Bharath)లో సుమారు 50 కోట్లకు పైగా వాట్సాప్‌ యూజర్లు ఉన్నారు. భారీ స్థాయిలో ఉన్న యూజర్ల కోసం వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త సెక్యూరిటీ, ఇతర ఫీచర్‌లను తీసుకొస్తోంది. మరియు ఇప్పటికే ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ను కూడా కలిగి ఉంది.

WhatsApp | మంచి ఆప్ష‌న్..

ప్రపంచవ్యాప్తంగా 3.5 బిలియన్లకు పైగా యూజర్లు (Group Voice Chat) కలిగిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. చాటింగ్ ఎక్స్‌పీరియన్స్ అప్‌గ్రేడ్ చేస్తూ.. గ్రూప్ చాట్స్(Group Chats) కోసం ప్లాట్‌ఫామ్ అధికారికంగా కొత్త వాయిస్ చాట్ టూల్ ప్రవేశపెట్టింది. ఇకపై మీ ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులు ఎవరికైనా ఈజీగా వాయిస్ చాట్(Voice Chat) పంపుకునేందుకు ప్ర‌త్యేక టూల్ తెచ్చింది మీరు ఇక నుండి లాంగ్ మెసేజ్ టైప్ చేసి పంపనక్కర్లేదు. గ్రూప్ చాట్‌లో లాంగ్ మెసేజ్ టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. వాట్సాప్ కొత్త వాయిస్ చాట్ టూల్ అందిస్తోంది.

ఇకపై యూజర్లు Users టైప్ చేయకుండానే నేరుగా గ్రూప్‌లో మాట్లాడొచ్చు. మెసేజ్ షేర్ చేయొచ్చు. ఈ టూల్ స్నేహితులు, ఫ్యామిలీ, సహోద్యోగులతో హ్యాండ్స్-ఫ్రీ, రియల్-టైమ్ వాయిస్ ఇంటరాక్షన్‌ పెంచుకోవచ్చు. ఈ వాయిస్ చాట్ (Group Voice Chat) టూల్ ఇప్పుడు ఇద్దరు నుంచి నలుగురు సభ్యుల స్మాల్ గ్రూపుల నుంచి 100 కన్నా ఎక్కువ మంది ఉండే భారీ కమ్యూనిటీల వరకు అన్ని రకాల గ్రూప్ సభ్యులకు అందుబాటులోకి వస్తోంది. మీ గ్రూప్‌లో ఎంత మంది ఉన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరూ లైవ్ గ్రూప్ వాయిస్ చాట్‌లో చేరవచ్చు. ట్రెడిషనల్ వాయిస్ నోట్స్(Traditional Voice Notes) మాదిరిగా ఉండదు. వాయిస్‌చాట్‌లోకి నేరుగా యాక్టివ్ అవ్వొచ్చు. ప్రత్యేకించి ఏది అవసరం లేదు. రియల్-టైమ్ గ్రూప్ కాల్ మాదిరిగా ఉంటుంది. ఈ కొత్త ఫీచర్‌తో డిజిటల్ కమ్యూనికేషన్‌(Digital Communication) మరింత నేచురల్‌గా ఉంటుంది.