HomeతెలంగాణHarish Rao | సిగాచి బాధితులకు పరిహారం ఏమైంది : హరీశ్​రావు

Harish Rao | సిగాచి బాధితులకు పరిహారం ఏమైంది : హరీశ్​రావు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | మాజీ మంత్రి హరీశ్​రావు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)కి బహిరంగ లేఖ రాశారు. సిగాచి పేలుడు (sigachi Industry) బాధితులకు ఇస్తామన్న రూ.కోటి పరిహారం ఏమైందని ఆయన ప్రశ్నించారు. నాలుగు నెలలుగా గడిచినా బాధితులకు పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సంగారెడ్డి జిల్లా పాశమైలారం (Pashamylaram) పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో జూన్​ 30న రియాక్టర్​ పేలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 40 మంది చనిపోయారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్​రెడ్డి ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందించడంతో పాటు సిగాచి పరిశ్రమ నుంచి మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇప్పిస్తామన్నారు. అయితే ఆ పరిహారం ఇంకా అందలేదని హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Harish Rao | రూ.26 లక్షలే ఇచ్చారు

సిగాచి మృతుల కుటుంబాలకు రూ.26 లక్షల చొప్పున మాత్రమే పరిహారం ఇచ్చారని హరీశ్​రావు పేర్కొన్నారు. ప్రమాదం జరిగి నాలుగు నెలలు అవుతున్నా… బాధితులకు ప‌రిహారం అంద‌క‌పోవ‌డం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఇచ్చింది రూ.26 లక్షలే అని, ప్రభుత్వం రూ.74 లక్షలు బాధితుకుల బాకీ పడిందన్నారు. కార్మికులకు రావాల్సిన పీఎఫ్ (PF), ఈఎస్ఐ (ESI), ఇన్సూరెన్స్ డబ్బులను కూడా నష్టపరిహారంలో చూపించడం దారుణమన్నారు.

Harish Rao | వారికి డెత్​ సర్టిఫికెట్లు ఇవ్వాలి

సిగాచి ఘటనలో రియాక్టర్​ పేలుడు ధాటికి పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. ఈ ఘటనలో 40 మంది చనిపోయారు. పేలుడు ధాటికి మాంసం ముద్దలుగా మారిపోయాయి. దీంతో డీఎన్​ఏ పరీక్షలు చేసి బాధిత కుటుంబాలకు మృతదేహాలను అప్పగించారు. అయితే 8 మంది మృతదేహాలు దొరకలేదు. వారికి డెత్​ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి డెత్​ సర్టిఫికెట్లు ఇచ్చి పరిహారం అందించాలని కోరారు.

Harish Rao | అరెస్ట్​ చేయాలి

సిగాచి కంపెనీ యాజమాన్యానికి అధికారులు ఏజెంట్లుగా మారరని ఆయన ఆరోపించారు. బాధితులను పట్టించుకోవడం లేదన్నారు. సిగాచి యజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్​ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై సిట్​ వేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం ప్రకటించినట్లు బాధితులకు వెంటనే రూ.కోటి పరిహారం ఇవ్వాలన్నారు. అలాగే కేంద్రం ప్రకటించిన రూ. 2 లక్షల పరిహారం సైతం బాధితులకు ఇప్పించాలని డిమాండ్​ చేశారు. లేదంటే బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో బాధితుల తరఫున పోరాటం చేస్తామని ఆయన లేఖలో హెచ్చరించారు.