అక్షరటుడే, వెబ్‌డెస్క్: wedding ceremony : ఉత్తరప్రదేశ్ Uttar Pradesh లోని భదోహిలో జరిగిన ఒక వివాహ వేడుకలో వరుడిని చూసిన వధువు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో గందరగోళం నెలకొంది. పెళ్లికి ముందు వేరే యువకుడిని చూపించారని, పెళ్లి ఊరేగింపులో మరొక యువకుడు వచ్చాడని వధువు ఆరోపిస్తోంది.
పెళ్లి మండపంలో సరిగ్గా దండలు మార్చుకునే జైమాల వేదిక Jaimala platform పై వధువు పెళ్లికి నిరాకరించడంతో సమస్య మొదలైంది. వరుడితో సహా పెళ్లి కొడుకు తరఫు వారిని అమ్మాయి వైపు ఉన్నవారు బంధించారు. గంటల తరబడి చర్చలు జరిగినప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో పెళ్లిని ఆపేశారు.
భడోహిలోని ఒక గ్రామానికి శుక్రవారం సాయంత్రం ఒక వివాహ ఊరేగింపు వచ్చింది. జాన్వాసేలో జరిగిన వివాహ ఊరేగింపునకు వధువు వైపువారు ఘన స్వాగతం పలికారు. అల్పాహారం తర్వాత కొద్దిసేపటికే జైమాలా వేడుక ప్రారంభమైంది. వరుడు జైమాల వేదిక పైకి వచ్చాక, వధువు కూడా అక్కడికి చేరుకుంది.
ఈ సమయంలో వరుడిని చూసి వధువు షాక్ అయ్యింది. ఇతను పెళ్లి కొడుకు కాదంటూ ఆరోపించింది. వధువును ఒప్పించడానికి ప్రయత్నించినా ఆమె వినలేదు. అతడిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను సర్ది చెప్పి, పంపిచేశారు.