అక్షరటుడే, వెబ్‌డెస్క్: Singapore | సింగపూర్ వెళ్లారు. ఎంజాయ్ చేశారు. కానీ, పాడుబుద్ధి పుట్టింది. వేశ్యలను దోచుకోవాలని పన్నాగం పన్నారు. దోచుకున్నారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు ఇద్దరు భారతీయులు.
తమిళనాడు Tamil Nadu రాష్ట్రానికి అరొక్కియసామి డైసన్(23), రాజేంద్రన్ మయిలరసన్(27) వేసవి సెలవులను ఎంజాయ్ చేయడానికి ఏప్రిల్ 24న సింగపూర్ దేశానికి వెళ్లారు. అక్కడ మస్త్‌గా ఎంజాయ్ చేశారు.
రెండు రోజుల తర్వాత వీరిని ఒకడు పరిచయం చేసుకున్నాడు. అమ్మాయిలు కావాలని అడగంతో అతగాడు వీరికి ఇద్దరు యువతుల నంబర్లు ఇచ్చాడు.
Singapore | వేశ్యలనే దోచుకోవాలని ప్లాన్
దీంతో వీరికి వక్రబుద్ధి పుట్టింది. వేశ్యలనే దోచుకోవాలని ప్లాన్ వేశారు. మొదట ఒక మహిళను హోటల్‌కు పిలిపించారు. ఆమెను గదిలో బంధించారు. కాళ్లూచేతులు కట్టేశారు ఆమె వద్ద నుంచి నగలు, నగదు, పాస్‌పోర్టు passport, బ్యాంకు కార్డులు, రెండు వేల సింగపూర్ డాలర్లు దోచుకున్నారు.
అదే రాత్రి మరో మహిళను పిలిపించారు. ఆమెను కూడా బంధించి 800 సింగపూర్ డాలర్లు dollars, పాస్‌పోర్టు, రెండు ఫోన్లు దోచుకున్నారు. అనంతరం అక్కడి నుంచిఇ పారిపోయారు.
బాధితులు మరుసటి రోజు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులను వెతికిపట్టుకున్నారు. విచారణలో నేరం అంగీకరించారు. ఈ మేరకు సింగపూర్ కోర్టు శుక్రవారం (అక్టోబరు 3) ఐదేళ్ల జైలు, 12 బెత్తం దెబ్బల శిక్ష విధించింది.
కాగా, తన తండ్రి చనిపోయాడని, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారని, వారి పెళ్లిళ్లు చేయడానికే ఇలా దొంగతనం చేసినట్లు కోర్టు ఎదుట రాజేంద్రన్ వాపోయినట్లు సింగపూర్ డెయిలీ Singapore Daily ప్రచురించింది.