అక్షరటుడే, ఇందూరు: Municipal Elections | మహారాష్ట్ర కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిందని.. అదే స్ఫూర్తితో ఇందూరులోనూ విజయ సాధిస్తామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్‌లో శుక్రవారం మహారాష్ట్ర కార్పొరేషన్ ఎన్నికల్లో (Maharashtra Corporation elections) విజయం సాధించిన నేపథ్యంలో పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
Municipal Elections | 29 కార్పొరేషన్లకు గాను.. 26 బీజేపీ మహాయుతి..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో మొత్తం 29 కార్పొరేషన్లకు గాను 26 బీజేపీ మహాయుతి కూటమి గెలుపొందిందన్నారు. హిందువులంతా ఏకమై ఘన విజయాన్ని అందించారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటే మైనారిటీ అని.. మైనారిటీలు అంటే కాంగ్రెస్ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ప్రజలు గ్రహించారన్నారు. అప్పటినుంచి హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయన్నారు. నిజామాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయమని, ఇందూరుగా పేరు మార్చడం కూడా ఖాయమన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, కార్యదర్శి జ్యోతి, ఆయా మండలాల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
