Homeజిల్లాలునిజామాబాద్​Armoor Police | అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే కఠినచర్యలు తీసుకుంటాం..

Armoor Police | అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే కఠినచర్యలు తీసుకుంటాం..

రాత్రివేళల్లో అనవసరంగా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మూర్​ ఎస్​హెచ్​వో సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం అర్ధరాత్రి పట్టణంలో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్ ​: Armoor Police | అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా తిరిగితే కఠినచర్యలు తీసుకుంటామని ఆర్మూర్​ ఎస్​హెచ్​వో సత్యనారాయణ (Armoor SHO Satyanarayana) పేర్కొన్నారు. పట్టణంలో బుధవారం అర్ధరాత్రి సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.

Armoor Police | యువకులకు కౌన్సెలింగ్​..

ఈ సందర్భంగా ఎలాంటి అవసరం లేకున్నప్పటికీ రోడ్లపై తిరుగుతున్న 20మంది యువకులను పట్టుకొని కౌన్సెలింగ్ (Counseling) నిర్వహించారు. అనంతరం వారికి జరిమానా విధించారు. మరొకసారి అనవసరంగా రాత్రివేళల్లో రోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.