అక్షరటుడే, ఇందూరు : Koradi Kiran | నగరంలోని 52వ డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తామని బీజేపీ అభ్యర్థి (BJP Candidate) కోరడి కిరణ్ అన్నారు. ఈ మేరకు డివిజన్ పరిధిలోని ఆయా కాలనీల్లో ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కోరడి కిరణ్ మట్లాడుతూ.. డివిజన్లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. తనను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే డివిజన్లోని ఆయా కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పాటు పడతానన్నారు. ప్రభుత్వంతో కొట్లాడైనా నిధులు తీసుకొచ్చి డివిజన్లో ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
Koradi Kiran | ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ధన్పాల్..
నగరంలో ఎంపీ అర్వింద్ (MP Arvind), ఎమ్మెల్యే ధన్పాల్ (MLA Dhanpal) ఆధ్వర్యంలో డివిజన్ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానన్నారు. డివిజన్లో అనేక ప్రాంతాల్లో సమస్యలున్నాయని.. గెలిచిన తర్వాత ప్రజలతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) బీజేపీ అభ్యర్థిని ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా మోర్చా, యువ మోర్చా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

