అక్షరటుడే ఇందూరు: MP ARVIND | మున్సిపల్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ అభ్యర్థి చేత బకాయి ఆస్తి పన్ను కట్టించిన ఘనత బీజేపీకి చెందుతుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) అన్నారు. నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో బీజేపీ అభ్యర్థులతో కలిసి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా ఆస్తి పన్ను (property tax) కట్టకుండా అధికారులను మేనేజ్ చేశారన్నారు. ఎన్నికలు రాగానే అన్ని డబ్బులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇన్ని రోజులు పన్నులు కట్టలేని అభ్యర్థి మేయర్ అయితే నగరాన్ని దోచుకునే పరిస్థితి నెలకొంటుందన్నారు.
MP ARVIND | నగరవాసులు ఆలోచించండి..
నగరవాసులు ఆలోచించి బీజేపీకి ఓటెయ్యాలన్నారు. ప్రతి పథకంలో కేంద్ర వాటా ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతుందని ఆరోపించారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta), నగరపాలక సంస్థ బీజేపీ ఇన్ ఛార్జి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఏడో డివిజన్ అభ్యర్థి శ్రవణ్ కుమార్, 8వ డివిజన్ అభ్యర్థి మఠం పవన్, 50వ డివిజన్ అభ్యర్థి జగదీష్ కులకర్ణి, 26వ డివిజన్ అభ్యర్థి బంటు రాము తదితరులు పాల్గొన్నారు.