అక్షరటుడే, వెబ్‌డెస్క్: Birds | సాధారణంగా మనం నిద్రలో ఉన్నప్పుడు రకరకాల కలలు వస్తుంటాయి. కొన్ని మేల్కొన్న తర్వాత గుర్తుండవు, మరికొన్ని మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అయితే, స్వప్న శాస్త్రం ప్రకారం మనకు వచ్చే ప్రతి కలకు ఒక పరమార్థం ఉంటుంది. ఇవి మన భవిష్యత్తులో జరగబోయే శుభ, అశుభ పరిణామాలకు సంకేతాలుగా పనిచేస్తాయి.
కొన్ని కలలు ఆందోళన కలిగిస్తే, మరికొన్ని కలలు రాబోయే అదృష్టాన్ని సూచిస్తాయి. ముఖ్యంగా కలలో కొన్ని రకాల పక్షులు కనిపిస్తే, అవి జీవితంలోకి సంపద, సంతోషం రాబోతున్నాయని అర్థం. ఆ ఐదు రకాల పక్షులు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Birds | ఏ పక్షుల వల్ల ఎలాంటి ఫలితాలో చూద్దాం
గుడ్లగూబ Owl: గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు. చాలా మంది గుడ్లగూబను చూస్తే భయపడతారు కానీ, కలలో గుడ్లగూబ కనిపించడం పరమ శుభప్రదం. ఇది లక్ష్మీదేవి అనుగ్రహం లభించబోతోందని సూచిస్తుంది. త్వరలోనే ఆర్థిక కష్టాలు తీరిపోయి, సంపద వృద్ధి చెందుతుంది.
నీలి రంగు పక్షి (Blue Bird): కలలో నీలి రంగు పక్షి కనిపిస్తే అది సాక్షాత్తు పరమశివుని ఆశీస్సులకు సంకేతం. జీవితంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోయే సమయం దగ్గరపడిందని అర్థం. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి.
నెమలి Peacock: కలలో నెమలి కనిపించడం అంటే శ్రీకృష్ణుని కటాక్షం మనపై ఉందని అర్థం. ఇది కెరీర్ లేదా వ్యాపారంలో గొప్ప పురోగతిని సూచిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తిపరంగా అద్భుతమైన విజయాలు అందుకుంటారు.
చిలుకలు Parrots: చిలుకలు జ్ఞానానికి, ప్రేమకు, సంతోషానికి చిహ్నాలు. కలలో చిలుకలు కనిపిస్తే కుటుంబ జీవితం ప్రశాంతంగా మారుతుందని అర్థం. ప్రేమికులకు ఇది శుభ సంకేతం. అలాగే త్వరలోనే ఏదైనా ఒక తీపి కబురు వినే అవకాశం ఉంది.
హంసలు Swans: తెల్లటి హంసలు కలలో కనిపించడం జ్ఞానానికి, పవిత్రతకు నిదర్శనం. జంట హంసలు కనిపిస్తే ఆ ఇంట్లో త్వరలోనే పెళ్లి లేదా ఇతర శుభకార్యాలు జరుగుతాయని అర్థం. ఇది ఊహించని ధనలాభాన్ని కూడా సూచిస్తుంది.
