BJP Nizamabad | కేంద్ర సర్వేతో తేలనున్న రోహింగ్యాల లెక్క: బీజేపీ జిల్లా అధ్యక్షుడు

అక్షరటుడే, ఇందూరు: BJP Nizamabad | కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న సర్వేతో దేశవ్యాప్తంగా రోహింగ్యాల లేక్కతేలిపోతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి(Dinesh Kulachari), అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా(Urban MLA Dhanpal) అన్నారు. గురువారం నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో ప్రధాని మోదీ(Prime Minister Modi), రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(State President Kishan Reddy), ఎంపీ అర్వింద్​ ధర్మపురి(MP Arvind Dharmapuri) చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేబినెట్​ […]

అక్షరటుడే, ఇందూరు: BJP Nizamabad | కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న సర్వేతో దేశవ్యాప్తంగా రోహింగ్యాల లేక్కతేలిపోతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి(Dinesh Kulachari), అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా(Urban MLA Dhanpal) అన్నారు. గురువారం నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో ప్రధాని మోదీ(Prime Minister Modi), రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(State President Kishan Reddy), ఎంపీ అర్వింద్​ ధర్మపురి(MP Arvind Dharmapuri) చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేబినెట్​ నిర్ణయం మేరకే జనగణన.. కులగణన(Caste Census) నిర్వహించనున్నారని తెలిపారు. దేశంలో కులగణన తమ ఒత్తిడి మేరకే నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్(Congress) చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్ర ప్రభుత్వం(Central Government) నిర్ణయం తీసుకుందని తెలిపారు. కేంద్రం నిర్వహించే కులగణన నిష్పక్షపాతంగా జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) రాష్ట్రంలో జరిపిన కులగణన అస్పష్టంగా ఉందని, అన్ని తప్పులేనని విమర్శించారు. కేంద్రం నిర్వహించే సర్వేతో రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో.. రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారో.. పూర్తి లెక్క తేలుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు న్యాలం రాజు, పోతంకర్ లక్ష్మీనారాయణ, స్వామి యాదవ్, స్రవంతి రెడ్డి, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...