అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ స్టేట్‌గా నిలుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చనక కొరాట ఎత్తిపోతల పథకం, సదర్మట్ బ్యారేజీలను ప్రారంభించారు.
అనంతరం నిర్మల్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉందని అన్నారు. ఈ జిల్లాకు ఘనమైన పోరాట చరిత్ర ఉందని పేర్కొన్నారు. అయితే గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందన్నారు. గత ప్రభుత్వం అనుకుంటే చనాకా-కొరాటా ప్రాజెక్టు (Chanaka-Korata Project) ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. కానీ.. తాము పక్కా ప్రణాళికతో జిల్లా అభివృద్ధికి ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
CM Revanth Reddy | ఉమ్మడి ఆదిలాబాద్‌కు యూనివర్సిటీ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి పాలమూరుతో సమానం నిధులు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో ఉందన్నారు. ఆదిలాబాద్ యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత నాదని అన్నారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను కూడా నిర్మల్ జిల్లా (Nirmal District)లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. అసెంబ్లీలో ఆదిలాబాద్ నేతలతో పత్యేకంగా సమావేశం నిర్వహించి.. బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తామని చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లోపు తుమ్మడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టు ప్రణాళికలు సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.
CM Revanth Reddy | ఎయిర్‌పోర్టు తీసుకొస్తాం
ఎర్రబస్సు రావడమే కష్టంగా ఉండే ఆదిలాబాద్ ప్రాంతానికి ఎయిర్‌పోర్టు తీసుకొస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. స్వయంగా ప్రధాని మోడీ (PM Modi)తో ఎయిర్ పోర్టును ప్రారంభింజేస్తామని తెలిపారు. అంతేకాకుండా అతిపెద్ద పారిశ్రామిక వాడను కూడా ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
CM Revanth Reddy | అభివృద్ధి కోసం ప్రధానిని కలుస్తున్నా..
రాష్ట్ర అభివృద్ధి కోసం పదే పదే ప్రధాని మోడీని కలుస్తున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ (Telangana) అభివృద్ధి, ప్రజల కోసం ఎవరినైనా కలుస్తానన్నారు. అడగకపోతే అమ్మ కూడా పెట్టదని.. అందుకే ప్రతీసారి వెళ్లి పరిస్థితిని మోదీకి వివరించి అభివృద్ధికి సహకరించాలని మోదీని కోరుతున్నామని తెలిపారు.
CM Revanth Reddy | ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తోంది
ప్రపంచమంతా హైదరాబాద్ (Hyderabad) వైపు చూసేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ కొందరు కాళ్లలో కట్టెలు పెడుతున్నారని పేర్కొన్నారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మాపైనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న కేసీఆర్.. అభివృద్ధికి సలహాలు ఇవ్వకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు వారికి రాజకీయ సమాధి కట్టడం ఖాయమని వ్యాఖ్యానించారు.