అక్షరటుడే, వెబ్‌డెస్క్: Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్‌లు విధిస్తామని బెదిరింపులకు దిగారు. గాజా బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరడానికి నిరాకరించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
డోనాల్డ్ ట్రంప్ ఇటీవల అన్ని దేశాలపై టారిఫ్‌లు విధిస్తున్న విషయం తెలిసిందే. తన మాట వినని దేశాలను టారిఫ్‌ల పేరుతో బెదిరిస్తున్నారు. గ్రీన్‌ల్యాండ్ (Greenland) విషయంలో సైతం ఈయూ దేశాలపై సుంకాలు విధిస్తామన్నారు. తాజాగా ఆయన గాజా పీస్ బోర్డులో చేరాలని ఫ్రాన్స్‌ను ఆహ్వానించాడు. అయితే ఆ దేశ అధ్యక్షుడు మెక్రాన్ అందుకు నిరాకరించారు. దీంతో ఫ్రాన్స్ నుంచి అమెరికాకు దిగిమతి అయ్యే వైన్, షాంపైన్‌పై 200శాతం సుంకాలు విధిస్తానంటూ ఎక్స్ వేదికగా ట్రంప్ ప్రకటించారు.
Trump Tariffs | దౌత్యవేత్తల ఆగ్రహం
ట్రంప్ మెక్రాన్ పంపినట్లు చెప్పబడుతున్న ప్రైవేట్ సందేశాన్ని బహిరంగంగా పంచుకున్నారు. గ్రీన్‌ల్యాండ్ వదిలి వెళ్లాలని అమెరికాకు సూచించినట్లు అందులో ఉంది. అలాగే ఇరాన్, ఉక్రెయిన్ విషయంలో USకు మద్దతిస్తామని ఆఫర్ ఇచ్చారని, దావోస్ (Davos) అనంతరం G7 సమావేశం పెడతానని మెక్రాన్ తెలిపినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్, రష్యా, సిరియాను ఆహ్వానిస్తాన్నట్లు తెలిపారు. ఈ ప్రైవేట్ కమ్యూనికేషన్ బహిర్గతం చేయడంపై యూరోపియన్ దౌత్యవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రంప్ ఆహ్వానాన్ని ఫ్రాన్స్ తిరస్కరిస్తుందని, సొంత విదేశాంగ విధాన ప్రాధాన్యతలు, దీర్ఘకాలిక పొత్తులపై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు మెక్రాన్ కార్యాలయం (Micron Office) తెలిపింది. యూరోపియన్ అధికారులు ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు. ఇటువంటి సుంకాల బెదిరింపులు నాటో భాగస్వాముల మధ్య విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని, ఉమ్మడి భద్రతా సవాళ్లపై సహకారాన్ని క్లిష్టతరం చేస్తాయని హెచ్చరించారు.