అక్షరటుడే, బోధన్: Bodhan Municipality | జిల్లాలో అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరేస్తామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (Balkonda MLA Prashanth Reddy) అన్నారు. బోధన్ పట్టణంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల (Municipal Election) సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Bodhan Municipality | ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చిన కాంగ్రెస్..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గద్దెదించాల్సిన సమయం వచ్చిందని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓట్లు అడుగుతూ.. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ సీఎంగా కేసీఆర్ రావాలని ఆయన ఆకాంక్షించారు.
తెలంగాణ ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్‌ను ఎవరూ వేరు చేయలేరన్నారు. అన్ని మున్సిపాలిటీలలో గులాబీ జెండా ఎగరేలా పార్టీ కార్యకర్తలు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్, ఆయన సతీమణి ఆయేషా ఫాతిమా, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.