అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : PCC Chief | రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని, నిజామాబాద్ కార్పొరేషన్ (Nizamabad Corporation)ను కైవసం చేసుకుంటామని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు నగరంలోని కాంగ్రెస్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
PCC Chief | పంచాయతీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశాం..
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో అధిక సంఖ్యలో స్థానాలను కాంగ్రెస్ పార్టీ (Congress Party) కైవసం చేసుకుందని పీసీసీ చీఫ్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో విధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ తరపున పార్టీ కార్యకర్తలకు బీ ఫారం ఇచ్చే విషయంలో ఎలాంటి పక్షపాత ధోరణి ఉండదని ప్రజలు కోరుకునే వారికే టికెట్ ఇస్తామన్నారు. పార్టీలో కొనసాగుతూ కష్టపడి పనిచేసే వారికే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
PCC Chief | ఐటీ మంత్రిగా ఉండి కేటీఆర్ ఏం చేశారు..
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ (KTR) రూ.10వేల కోట్ల పెట్టుబడులు కూడా తేలేదని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. రేవంత్ సీఎం అయ్యాక రూ. లక్షా 70 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారన్నారు. రూ.5లక్షల కోట్లకు పైగా గ్లోబల్ సమ్మిట్ ద్వారా పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం చేసుకున్నామని ఆయన వివరించారు.
PCC Chief | ఉచిత బియ్యం తెలంగాణలో ఇస్తున్నాం..
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎక్కడా ఇవ్వడం లేదని కానీ తెలంగాణ (Telangana)లో ప్రతి రేషన్‌కార్డుదారుడికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ వెల్లడించారు. ఇల్లు లేని పేదవారు ఉండవద్దనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు. ఎన్నడూ లేనంత అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగినందున మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) 90 శాతం సీట్లు గెల్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
PCC Chief | ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన మోదీ
ఉద్యోగాలిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ (PM Modi) ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారని మహేష్ గౌడ్ విమర్శించారు. దేవుడి పేరిట కాకుండా 12ఏళ్లలో చేసిన అభివృద్ధి గురించి చెప్పి బీజేపీ ఓట్లు అడగాలని ఆయన సూచించారు. పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జిల్లాను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రాజీ లేకుండా నిజామాబాద్ అభివృద్ధి కోసం పని చేస్తున్నామని పేర్కొన్నారు.
PCC Chief | కవిత వచ్చినా.. జనసేన వచ్చినా.. స్వాగతిస్తాం..
రాబోయే ఎన్నికల్లో జనసేన వచ్చినా, కవిత పార్టీ పెట్టినా స్వాగతిస్తామని పీసీసీ చీఫ్ అన్నారు. ఎవరు వచ్చినా ప్రజల ఆదరణ పొందాలన్నారు. దేశంలో నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తారనుకుంటే పేర్లు మార్చడానికే మోదీ పరిమితమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల జీవన స్థితిగతులు మార్చాలి కాని పేర్లుకాదని ఆయన సూచించారు.
PCC Chief | పేరు మారుస్తానంటున్న అర్వింద్ ఏడేళ్లలో ఏం చేశారు..
నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామంటున్న ఎంపీ అర్వింద్ (MP Arvind) ఏడేళ్లలో జిల్లాకు ఏం చేశారో చెప్పాలని బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల ఇచ్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. బీజేపీనే బీసీలకు న్యాయం చేయకుండా అడ్డుపడుతోందని
PCC Chief | 42శాతం రిజర్వేషన్లు తేలాకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు..
42శాతం రిజర్వేషన్లు తేలాకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) భావిస్తున్నారన్నారు. 24 నెలల్లోనే 80 వేల ఉద్యోగాలిచ్చామని.. మరో మూడేళ్లలో మరో 2 లక్షల ఉద్యోగాలిస్తామని పీసీసీ చీఫ్ హామీనిచ్చారు. బీఆర్ఎస్ కథ ముగిసిపోయిందన్నారు. కవిత విమర్శలకు హరీష్, కేటీఆర్ వద్ద జవాబులున్నాయా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నుడా ఛైర్మన్ కేశ వేణు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, సీనియర్ నాయకులు దాసరి నర్సింలు, నరాల రత్నాకర్, వినయ్ రెడ్డి, జావిద్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.