అక్షరటుడే, ఆర్మూర్ : KR Suresh Reddy | మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) విజయం సాధించి ఆర్మూర్ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి అన్నారు. పట్టణంలోని క్షత్రియ కల్యాణ మండపంలో బుధవారం పురపాలక ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
KR Suresh Reddy | కలిసికట్టుగా పనిచేసి..
ఈ కార్యక్రమానికి అయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేలాగా కృషి చేయాలని సురేష్ రెడ్డి అన్నారు. ఆయా వార్డుల అభివృద్ధికి రాజ్యసభ నిధుల నుంచి కాలనీల అభివృద్ధికి తనవంతుగా నిధులను కేటాయిస్తానన్నారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Former MLA Jeevan Reddy) మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడగాలన్నారు.
ఆర్మూర్ పట్టణంలో ఎటు చూసినా బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) వచ్చిన రెండేళ్లలో ఆర్మూర్లో చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. పెన్షన్లు పెంచుతామని చెప్పి, తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. కార్యక్రమంలో బోధన్ మాజీ ఎమ్మెల్యేలు షకీల్, బిగాల గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పూజ నరేందర్, పోల సుధాకర్, సుంకరి రవి, గంగాధర్, నచ్చు చిన్నారెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.