అక్షరటుడే,ఎల్లారెడ్డి: Yellareddy Municipality | ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో అన్ని స్థానాల్లో పోటీ చేసి బల్దియాపై బీజేపీ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు బాణాల లక్ష్మారెడ్డి అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు ఆధ్వర్యంలో పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
Yellareddy Municipality | ప్రతి వార్డుకు ఇన్ఛార్జీలు..
మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Election) ప్రతి వార్డుకు ఇన్ఛార్జీలను నియమించినట్లు బాణాల లక్ష్మారెడ్డి అన్నారు. అదేవిధంగా జరగబోయే అన్ని మున్సిపాలిటీలపై బీజేపీ జెండా (BJP Flag) ఎగురవేయాలని రాష్ట్ర బీజేపీ గట్టి సంకల్పంతో ఉందన్నారు. ఇదే సంకల్పంతో మహారాష్ట్ర బల్దియా ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. అలాగే మహారాష్ట్ర, కర్ణాటక ఎమ్మెల్యేలను ఎల్లారెడ్డికి ఇన్ఛార్జీలుగా పంపుతామని రాష్ట్ర కమిటీ సూచన చేయడం జరిగిందన్నారు.
Yellareddy Municipality | సైనికుల్లా పనిచేయాలి..
ప్రతిఒక్క కార్యకర్త సైనికుల్లాగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని బాణాల సూచించారు. కార్యక్రమంలో రాష్ట నాయకులు బాలకిషన్, జిల్లా ఉపాధ్యక్షుడు దేవేందర్, పట్టణ అధ్యక్షుడు రాజేష్, మండల అధ్యక్షుడు నర్సింలు, ప్రధాన కార్యదర్శులు శ్రీను, అశోక్, మహిళా నాయకురాలు సుజాత, మాజీ ఎంపీపీ నక్క గంగాధర్, మాజీ అధ్యక్షుడు సతీష్, హన్మాండ్లు, దత్తు, సీనియర్ నాయకులు బాలరాజ్, సత్యం, బాలయ్య, యువ నాయకులు శివ, పులి రమేష్, శివ, పండరి తదితరులు పాల్గొన్నారు.