అక్షరటుడే, ఆర్మూర్: Mla Rakesh Reddy | మహారాష్ట్ర ఎన్నికల గెలుపు స్ఫూర్తితో ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంపై బీజేపీ జెండా ఎగురవేస్తామని ఆర్మూర్ ఎమ్మెల్యే పార్టీ రాకేష్ రెడ్డి (MLA Rakesh Reddy) అన్నారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో (Maharashtra municipal elections) బీజేపీ భారీ విజయం సాధించడంతో ఆర్మూర్‌లో ఆ పార్టీ నేతలు సంబరాలు నిర్వహించారు.
Mla Rakesh Reddy | అంబేడ్కర్ చౌరస్తాలో..
పట్టణంలో అంబేడ్కర్ చౌరస్తాలో జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ కంచెట్టి గంగాధర్‌కు మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో మహారాష్ట్ర ప్రజలు మరొక్కసారి బీజేపీకి పట్టం కట్టరాన్నారు. అదే స్ఫూర్తితో ఆర్మూర్ పట్టణంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేసి ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి పోల్కం వేణు, కలిగోట గంగాధర్, ఖాందేశ్ ప్రశాంత్, సాయి, రంగన్న, రాజేశ్వర్, ప్రశాంత్, ఉదయ్ గౌడ్, యుగేందర్ నాయకులు పాల్గొన్నారు.