అక్షరటుడే, కామారెడ్డి: Health Department | వేతనాల్లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఈనెల21వ తేదీ లోపు తమకు జీతాలివ్వకపోతే సమ్మెకు వెళ్తామని ఎన్హెచ్ఎం ఉద్యోగులు (NHM employees) తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా వైద్యాధికారి విద్యకు (District Medical Officer Vidya), ఆర్ఎంవో సుజాతకు మెమోరాండం అందజేశారు.
Health Department | నాలుగు నెలలుగా జీతాల్లేవు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నాలుగు నెలలుగా వేతనాల కోసం ఎదురు చూస్తున్నామని.. అప్పులు చేస్తూ కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తోందన్నారు. దసరా నుంచి సంక్రాంతి (Dasara to Sankranthi) వరకు జీతాలు లేకపోవడం బాధాకరమన్నారు. అరకొర వేతనాలతో ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నామని, ప్రభుత్వ పథకాలు పల్లెల వరకు, సామాన్య ప్రజల వరకు చేరవేసేది ఎన్హెచ్ఎం ఉద్యోగులేనని తెలిపారు. పెండింగ్లో ఉన్న జీతభత్యాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 14 నుంచి 21వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి వైద్యారోగ్య సేవలను (medical and health services) కొనసాగిస్తామని తెలిపారు.
ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరసనలు తెలియజేస్తామన్నారు. ఈనెల 21 వరకు వేతనాలు పడకపోతే 22వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని తెలిపారు. వేతనాల కోసం ఇబ్బందిపెట్టకుండా ప్రతినెలా 5వ తేదీ లోపు ఎన్హెచ్ఎం కాంటాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్హెచ్ఎం జేఏసీ జిల్లా నాయకులు సుమన్, వెంకటరమణ, రాజు, శ్రీకాంత్, పద్మజ, అశ్విని, సుభాషిని, శోభ, మౌనిక తదితరులు పాల్గొన్నారు.