అక్షరటుడే, బోధన్: MLA Sudarshan Reddy | బోధన్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) పేర్కొన్నారు. పట్టణంలోని తాగునీటి కోసం రూ.50 కోట్లతో నిర్మించ తలపెట్టిన నీటి ట్యాంకులు (water tanks), పైప్లైన్ నిర్మాణ పనులకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ.18 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులకు సైతం ఆయన శంకుస్థాపన చేశారు.
MLA Sudarshan Reddy | డయాలిసిస్ సెంటర్ ప్రారంభం..
అంతకుముందు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, డీసీసీ డెలిగేట్ గంగా శంకర్, పట్టణ అధ్యక్షుడు పాషా తదితరులు పాల్గొన్నారు.