Homeతాజావార్తలుCM Revanth Reddy | ఆదిలాబాద్​కు ఎయిర్​ బస్​ తీసుకొస్తాం.. సీఎం రేవంత్​రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy | ఆదిలాబాద్​కు ఎయిర్​ బస్​ తీసుకొస్తాం.. సీఎం రేవంత్​రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆదిలాబాద్​లో త్వరలో ఎయిర్ పోర్టు పనులు ప్రారంభిస్తామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth Reddy | త్వరలో ఆదిలాబాద్​ జిల్లాకు ఎయిర్​బస్ తీసుకు వస్తామని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఏడాదిలో ఎయిర్ పోర్టు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఎర్ర బస్సే కాదు.. ఎయిర్ బస్సును (Air bus) కూడా తీసుకొస్తామన్నారు.

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా గురువారం సీఎం ఆదిలాబాద్​ జిల్లాలో (Adilabad district) పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆదిలాబాద్ మునిసిపాలిటీలోని (Adilabad Municipality) 49 వార్డులను రూ.18.70 కోట్లతో అభివృద్ధి చేయడం, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.1.75 కోట్ల పెట్టుబడితో పెట్రోల్ బంక్ ఏర్పాటు తదితర పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. మహాలక్ష్మివాడ, విద్యానగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో రూ.2 కోట్లతో అదనపు గదులు మరియు ఆధునీకరణ పనులు ప్రారంభించారు.

CM Revanth Reddy | జిల్లాను అభివృద్ధి చేస్తాం

ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి త్వరలోనే ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. కేంద్రంతో మాట్లాడి ఆదిలాబాద్‎లో సిమెంట్ కంపెనీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. చనాకా కొరట ప్రాజెక్టును త్వరలోనే జాతికి అంకిస్తాం చేస్తామన్నారు.

CM Revanth Reddy | కేసీఆర్​ కుటుంబంలో పైసల పంచాయితీ

మాజీ సీఎం కేసీఆర్‌పై (former CM KCR) రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. చేసిన పాపం ఊరికే పోదన్నట్లు సొమ్ము వచ్చిన తర్వాత సొంత పిల్లలే కత్తులతో పొడుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో పైసల పంచాయతీ నడుస్తోందని ఎద్దేవా చేశారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను తీసుకుంటానని చెప్పారు.

Must Read
Related News