Homeజిల్లాలునిజామాబాద్​Flag Day | సాయుధ దళాలకు మద్దతుగా ఉండాలి: కలెక్టర్​

Flag Day | సాయుధ దళాలకు మద్దతుగా ఉండాలి: కలెక్టర్​

ప్రతి పౌరుడు సాయుధ దళాలకు మద్దతుగా నిలవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కోరారు. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కలెక్టరేట్​లో ర్యాలీని ప్రారంభించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : Flag Day | ప్రతి పౌరుడు సాయుధ దళాలకు మద్దతుగా నిలవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) కోరారు. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్​ వద్దల (District Collectorate) ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం సాయ దళాలకు చెందిన సైనికులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ శ్రమిస్తున్నారన్నారు. సైనికుల త్యాగాలను ప్రతిఒక్కరూ గుర్తిస్తూ వారి పట్ల వారి సేవల పట్ల గౌరవభావంతో మెలగాలన్నారు.
వారి గౌరవార్థం ప్రతిఏటా జరిపే సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది నుంచి మరింత అట్టహాసంగా నిర్వహించాలని సూచించారు. అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేయాలన్నారు. ఈ సందర్భంగా సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం సహాయ నిధిని విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ అధికారి రవీందర్, మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Must Read
Related News