అక్షరటుడే, బాన్సువాడ: Bajireddy Govardhan | బాన్సువాడ మున్సిపల్ (Banswada Municipality) కౌన్సిలర్ స్థానాలన్నింటినీ బీఆర్ఎస్ కైవసం చేసుకుని ఛైర్మన్ పీఠం దక్కించుకుంటామని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కార్యకర్తలతో సోమవారం సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Bajireddy Govardhan | బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే బాన్సువాడ మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందిందని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. బాన్సువాడ పట్టణ అభివృద్ధికి కేసీఆర్ రూ.650 కోట్లు ఇచ్చారని వివరించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజూ కేసీఆర్పై (KCR) దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) 19 వార్డులను కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం బాజిరెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జుబేర్, అంజిరెడ్డి, రత్నకుమార్, బీర్కూర్ సర్పంచ్ ధర్మతేజ, మోచి గణేశ్, సాయిబాబా, బోడ చందర్, రమేష్ యాదవ్, గౌస్, మహేష్, శివ తదితరులు పాల్గొన్నారు.