అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CITU Nizamabad | ఆశ వర్కర్ల పోరాటంలో విజయం సాధించామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని సీఐటీయూ కార్యాలయం (CITU office) వద్ద ఆమె మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం ఆశ వర్కర్లు చలో కలెక్టరేట్ (Chalo Collectorate) కార్యాయం నిర్వహించ తలపెట్టగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్లందరినీ పోలీసులు సీఐటీయూ కార్యాలయం వద్దకు తరలించారు. అక్కడ సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. ఆశ వర్కర్ల సమస్యల (ASHA workers problems) పరిష్కారం కోసం కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు.
CITU Nizamabad | సమస్యల పరిష్కారానికి హామీ
ఈ మేరకు ఆశవర్కర్ల సమస్య పరిష్కారానికి డీఎంహెచ్వో రాజశ్రీ హామీ ఇచ్చారని నూర్జహాన్ తెలియజేశారు. స్వయంగా సీఐటీయూ కార్యాలయానికి వచ్చిన ఆమె స్థానికంగా తమ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని సర్క్యూలర్ జారీ చేస్తానని హామీ ఇచ్చారన్నారు. దీనిని సీఐటీయూ విజయంగా నూర్జహాన్ పేర్కొన్నారు. ఈ పోరాటానికి సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు. కార్యక్రమంలో ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా నాయకులు సుకన్య, ఇందిరా, రేణుక, నర్స, బాలమణి, దివ్య, విజయ, లావణ్య, శాంతి, రేణుక రేఖ, కళావతి వందలా మంది ఆశ వర్కర్లు పాల్గొన్నారు.