అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | గర్భం దాల్చిన ఓ అమ్మాయికి ప్రైవేట్ వైద్యుడు (private doctor) అబార్షన్ చేయడం కలకలం సృష్టించగా.. ఈ విషయాన్ని ‘అక్షరటుడే’ (Akshara today) వెలుగులోకి తీసుకొచ్చింది. స్పందించిన అధికారులు తాడ్వాయి మండలంలో (Tadwai mandal) విచారణ సైతం చేపట్టారు.
సదరు వైద్యుడు బేరం కుదుర్చుకుని అబార్షన్ చేసిన విషయం నిజమేనని నిర్దారణకు వచ్చారు. గ్రామంలో విచారణ అనంతరం వైద్యుల బృందం సదరు ప్రైవేట్ వైద్యుని ఆస్పత్రికి (private doctor hospital) వెళ్లారు. ఆస్పత్రిలో విచారణ చేపట్టిన బృందానికి సదరు వైద్యుడు సహకరించలేదని తెలుస్తోంది.
Kamareddy | నాకేం తెలియదు..
ఆస్పత్రిలో తనిఖీ చేసిన విచారణ బృందానికి (investigation team) ఎలాంటి ఆధారాలు లభించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టుగా ప్రచారం సాగుతోంది. సదరు వైద్యుడిని అబార్షన్‌పై ప్రశ్నించగా తనకేమీ తెలియదని, తాను ఎలాంటి అబార్షన్ చేయలేదని, రిజిస్టర్లో కూడా ఎలాంటి వివరాలు నోట్ చేయలేదని వింత సమాధానాలు చెప్పినట్టు విశ్వాసనీయ సమాచారం. అయితే విచారణ ఇంకా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే బుధవారం రాత్రి అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా విశ్వసనీయ సమాచారం.
