అక్షరటుడే, ఇందూరు: Jagruthi Nizamabad | ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి (MLA Prashanth Reddy) అనుచరుల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలంగాణ జాగృతి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు నీళ్లివ్వాలనే కృత నిశ్చయంతో తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) నిర్మాణ ఎస్టిమేషన్ నాలుగేళ్లలో ఎందుకు రెట్టింపు అయ్యిందో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలని సవాల్ విసిరారు. ఈ కుట్ర వెనక ఉన్నది బాల్కొండ ఎమ్మెల్యే కాదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం నిర్మించడంలో కేసీఆర్‌ను కవిత ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడలేదన్నారు. తొమ్మిదిన్నరేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తర్వాత కూడా పనులు పూర్తికాక నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు (Nizamabad and Kamareddy districts) సాగునీరు రాలేదన్న రైతుల ఆవేదనను మాత్రమే ఎత్తి చూపించామని వారు స్పష్టం చేశారు. ఎస్సారెస్పీ నీటినే ప్యాకేజీ 20 ద్వారా తరలించి ప్యాకేజీ–21 పైపులైన్ ద్వారా కప్పలవాగులోకి ఒకే ఒక్కరోజు ఎత్తిపోశారన్నారు.
దీంట్లో ఎంతవరకు సాగులోకి వచ్చిందనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదన్నారు. నిజామాబాద్ తెలంగాణ జాగృతి ప్రతినిధి అవంతి కుమార్ మాట్లాడుతూ.. వరద కాలువలపై నిర్మించిన పంప్‌హౌజ్‌లలో జరిగిన అవినితీ రాష్ట్రమంతా తెలుసన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని ఏ ఒక్క ఎకరానికి కూడా నీరు రాలేదని కవిత పేర్కొన్నారని ఆ మాటలకు తెలంగాణ జాగృతి కట్టుబడి ఉందన్నారు. బోధన్ నియోజకవర్గ తెలంగాణ జాగృతి నాయకులు ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ.. ప్రశాంత్ రెడ్డికి ఎంపీ అర్వింద్‌కు ఉన్న లోపాయికారి ఒప్పందం ఏమిటో బహిర్గతం చేయాలన్నారు. బాల్కొండలో ఇసుక దందా ఎవరు చేశారో బీఆర్ఎస్ నాయకులే చెప్పాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ జాగృతి నాయకులు కరిపె రాజు, మీసాల శంకర్, అంబటి శ్రీనివాస్, శేఖర్ రాజ్, యెండల ప్రసాద్, జనార్దన్, సాయికృష్ణ, ఆజాం, షానవాజ్, హరీష్, సందీప్, ఆకాష్, వంశీ, జాగృతి మహిళా నాయకులు శోభ, సరిత, రేఖ తదితరులు పాల్గొన్నారు.
