అక్షరటుడే, కామారెడ్డి: Municipal Elections | మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Municipal Elections | నాలుగు మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు పూర్తి..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలున్నాయన్నారు. కామారెడ్డి మున్సిపల్ (Kamareddy Municipality) పరిధిలో 49 వార్డులు, బిచ్కుంద మున్సిపల్ పరిధిలో 12 వార్డులు, బాన్సువాడ మున్సిపల్ (Banswada Municipality) పరిధిలో 19 వార్డులు, ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో 12 వార్డులలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కామారెడ్డిలో 152 పోలింగ్ కేంద్రాలు, ఎల్లారెడ్డిలో 24, బాన్సువాడలో 39, బిచ్కుందలో 24 కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు నామినేషన్ కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు.
Municipal Elections | వెబ్ కాస్టింగ్.. నోడల్ అధికారులు..
ఎన్నికల నిర్వహణలో భాగంగా వెబ్ కాస్టింగ్ (Webcasting), నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, పీవోలు, ఓపీవోల నియామకం, శిక్షణ, ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అలాగే బీఎన్ఎస్ 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారుల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.