35
అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nagireddypet Bus Stand | నాగిరెడ్డిపేట్ బస్టాండ్‌ను ఆధునీకరిస్తున్నామని ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూ.33 లక్షలతో బస్టాండ్‌ను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు.
Nagireddypet Bus Stand | ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా..
ప్రయాణికులకు (passengers) ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు బస్టాండ్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మండలంలోని బస్టాండ్‌లోకి అన్ని ప్రాంతాల నుంచి బస్సులు వచ్చేవిధంగా అధికారులతో మాట్లాడుతున్నామన్నారు. ఆయనతో పాటు పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, రామచంద్ర రెడ్డి, విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.