Homeజిల్లాలుకామారెడ్డిMLA Laxmi Kantha Rao | అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నాం: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

MLA Laxmi Kantha Rao | అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నాం: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

జుక్కల్​ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. ఈ మేరకు జుక్కల్​ మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : MLA Laxmi Kantha Rao | నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. జుక్కల్ మండలం (Jukkal Mandal) మైబాపూర్ గ్రామంలో రూ.20 లక్షలతో పంచాయతీ భవన నిర్మాణ పనులకు, బిజ్జల్​వాడి గ్రామంలో రూ.29 లక్షల నిధులతో ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించడంతో పాటు పనులు వేగంగా జరిగేలా కృషి చేస్తున్నామన్నారు. అన్ని గ్రామాలకు రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ కల్పించే విధంగా ప్రయత్నిస్తున్నామన్నారు. విద్య, వైద్య వ్యవస్థలను మెరుగు పరుస్తామని హామీ ఇచ్చారు. 15 ఏళ్లుగా నియోజవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న హన్మంత్​ సింధే (Hanmant Shinde) అభివృద్ధి చేయలేదని ఆయన విమర్శించారు. అనంతరం జుక్కల్​ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) పాల్గొన్నారు.

Must Read
Related News