అక్షరటుడే, వెబ్‌డెస్క్: Wakefit Innovations IPO | బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఫర్నిషింగ్ బ్రాండ్ వేక్‌ఫిట్ ఇన్నోవేషన్(Wakefit Innovations) లిమిటెడ్‌ను 2016లో ప్రారంభించారు.
ఈ కంపెనీకి బెంగళూరు(Bengalore)లో 2, తమిళనాడు హోసూరులో 2, హరియాణాలోని సోనిపట్‌లో ఒకటి చొప్పున మొత్తం అయిదు తయారీ కేంద్రాలున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో కూడిన మెషినరీ, రోబోటిక్ ఆర్మ్స్, రోలర్ బెల్ట్స్ వంటి ఆటోమేషన్ టెక్నాలజీని ఈ కంపెనీ వినియోగిస్తోంది.
Wakefit Innovations IPO | రూ. 1,289 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో..
ఐపీవో(IPO) ద్వారా రూ. 1,289 కోట్లు సమీకరించనుంది. ఇందులో ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ. 377.18 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్(OFS) ద్వారా రూ. 912 కోట్లు సమీకరించనున్నారు. పబ్లిక్ ఇష్యూ ద్వారా వచ్చిన నిధులను 117 కొత్త కోకో రెగ్యులర్ స్టోర్ల ఏర్పాటుకు మూలధన వ్యయం కోసం, ప్రస్తుత కోకో రెగ్యులర్ స్టోర్లకు లీజు, సబ్‌లీజు అద్దెతోపాటు లైసెన్స్ ఫీజు చెల్లింపులకు, కొత్త పరికరాలు, యంత్రాల కొనుగోలుకు అయ్యే మూలధన వ్యయం కోసం, మార్కెటింగ్ మరియు ప్రకటన ఖర్చులతోపాటు ఇతర సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
Wakefit Innovations IPO | కంపెనీ ఆర్థిక పరిస్థితి..
2023 -24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ(Revenue) రూ. 1,017.33 కోట్లు ఉండగా.. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,305.43 కోట్లకు పెరిగింది. నష్టాలు(Loss) రూ. 15.05 కోట్లనుంచి రూ. 35 కోట్లకు పెరిగాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన ఆరు నెలల కాలానికి గానూ రూ.724 కోట్ల ఆదాయం ద్వారా రూ.35.5 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది.
Wakefit Innovations IPO | ప్రైస్‌బ్యాండ్..
ధరల శ్రేణి(Price band)ని కంపెనీ రూ. 185 నుంచి రూ. 195గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 76 ఈక్విటీ షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,820తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Wakefit Innovations IPO | కోటా, జీఎంపీ..
ఇష్యూలో 75 శాతం షేర్లను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల(QIB)కు, 15 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, 10 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ రూ. 36గా ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో 18 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Wakefit Innovations IPO | ఐపీవో తేదీలు..
కంపెనీ సబ్‌స్క్రిప్షన్(Subscription) ఈనెల 8న ప్రారంభమై 10తో ముగియనుంది. అలాట్‌మెంట్ స్టేటస్ 11న రాత్రి వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు ఈనెల 15న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.
