New Voter Card | 15 రోజుల్లోనే ఓటర్​ కార్డు.. ఈసీ కీలక మార్పులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: New Voter Card | ఎన్నికల సంఘం ఓటరు కార్డుల జారీ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. ఇక నుంచి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో కొత్త ఓటరు కార్డు(New Voter Card) ఇస్తామని తెలిపింది. కొత్త కార్డుల జారీతో పాటు పాత కార్డుల్లో వివరాల మార్పులకు ఈ నిబంధనల వర్తిస్తుందని ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో కొత్తగా ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే అది రావడానికి నెలకుపైగా సమయం పడుతోంది. ఎన్నికల సంఘం(Election […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: New Voter Card | ఎన్నికల సంఘం ఓటరు కార్డుల జారీ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. ఇక నుంచి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో కొత్త ఓటరు కార్డు(New Voter Card) ఇస్తామని తెలిపింది. కొత్త కార్డుల జారీతో పాటు పాత కార్డుల్లో వివరాల మార్పులకు ఈ నిబంధనల వర్తిస్తుందని ప్రకటించింది.

ప్రస్తుతం దేశంలో కొత్తగా ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే అది రావడానికి నెలకుపైగా సమయం పడుతోంది. ఎన్నికల సంఘం(Election Commission) త్వరగా కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 15 రోజుల్లోగా(15 Days) కొత్త ఓటరు కార్డులు వచ్చేలా మార్పులు చేసింది. పేర్ల నమోదు నుంచి కార్డుల జారీ వరకు ఉన్న ప్రతి దశను తక్షణ పర్యవేక్షణ చేయనున్నట్లు వివరించింది. ఓటరు కార్డుల స్థితి గురించి ఎప్పటికప్పుడు మెసెజ్​ల ద్వారా దరఖాస్తుదారులకు తెలియజేస్తామని ఈసీ తెలిపింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...