అక్షరటుడే, బాన్సువాడ : Banswada | ఓటు హక్కుపై అధికారులు అనేక అవగాహన కార్యక్రమాలు (Awareness Programs) నిర్వహిస్తున్నారు. సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటే ఓటుహక్కు వినియోగించుకోవాలని వారు కోరుతున్నారు. అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు సైతం ప్రజలకు ఓటుపై అవగాహన కల్పిస్తున్నాయి.
Banswada | ముందుకొచ్చిన వైద్యుడు..
ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు ఓ వైద్యుడు వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు. మన ఓటు, మన హక్కు అనే నినాదంతో ఓటు హక్కుపై చైతన్యం కల్పిస్తున్నారు. దీంట్లో భాగంగా బాన్సువాడ పట్టణానికి చెందిన రుక్మిణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల (Rukmini Multi Specialty Dental Hospital), ఇంప్లాంట్ సెంటర్ (Implant Center) ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా దంత వైద్యశాల వైద్యులు జీవన్ మాట్లాడుతూ.. ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదు.. ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఓటువేసిన ప్రజలకు తమ ఆస్పత్రిలో ఉచితంగా దంత పరీక్షలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
