Manik Bhavan | అభివృద్ధి చూసి ఓటేయ్యండి.. సభ్యులకు అధ్యక్ష అభ్యర్థి విన్నపం

అక్షరటుడే, ఇందూరు : Manik Bhavan : గతంలో తాము చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని మాణిక్ భవన్ పాఠశాల ( శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల) (Sri Nutan Vaishya High School) కార్యవర్గం అధ్యక్ష అభ్యర్థి ఇంగు శివప్రసాద్ కోరారు. నిజామాబాద్ (Nizamabad)​ నగరంలోని హోటల్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. Manik Bhavan : సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు.. గతంలో రెండు సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా […]

అక్షరటుడే, ఇందూరు : Manik Bhavan : గతంలో తాము చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని మాణిక్ భవన్ పాఠశాల ( శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల) (Sri Nutan Vaishya High School) కార్యవర్గం అధ్యక్ష అభ్యర్థి ఇంగు శివప్రసాద్ కోరారు. నిజామాబాద్ (Nizamabad)​ నగరంలోని హోటల్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Manik Bhavan : సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు..

గతంలో రెండు సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు శివప్రసాద్​ చేపట్టామన్నారు. ఇప్పటికే పాత భవనాలను మరమ్మతులు చేయించి పాఠశాలను ఉత్తమంగా తీర్చిదిద్దామన్నారు. విద్యార్థుల ఉన్నతికి, పేద వైశ్య విద్యార్థుల అభివృద్ధికి తమ వంతు తోడ్పాటును అందిస్తామన్నారు. విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను కూడా చేపడుతున్నట్లు తెలిపారు.

Manik Bhavan : ఈ నెల 6న ఎన్నికలు..

సభ్యులు ఈ నెల 6న మాణిక్ భవన్ పాఠశాల Manik Bhavan School లో జరిగే సంఘం ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు. తమ బ్యాలెట్ నెంబర్ 1 కి ఓటేసి, తమ ప్యానెల్​ను గెలిపించాలన్నారు. సమావేశంలో వైశ్య ప్రతినిధులు రాజశేఖర్, సతీష్ కుమార్, అరుణ్ కుమార్, రాఘవేంద్ర, వీరేందర్, సత్యప్రసాద్, శ్రీనివాస్, హరీష్ కుమార్, శ్రీధర్ గుప్తా, దీకొండ యశ్వంత్, పవన్ కుమార్, వెంకన్న, పాల్తి శ్రీనివాస్, రజినీకాంత్, సతీష్, విట్టల్, అమరేందర్ పాల్గొన్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...