Homeతాజావార్తలుKomuravelli Mallanna | కొమురవెల్లి మల్లన్న దర్శనాలు నిలిపివేత

Komuravelli Mallanna | కొమురవెల్లి మల్లన్న దర్శనాలు నిలిపివేత

కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవం ఈ నెల 14న నిర్వహించనున్నారు. ఈ నెల 7న రాత్రి నుంచి 14న ఉదయం వరకు స్వామి వారి మూల విరాట్ దర్శనాలు నిలిపివేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Komuravelli Mallanna | సిద్దిపేట జిల్లా (Siddipet District) చేర్యాల మండలం కొమురవెల్లిలో కొలువైన మల్లన్న స్వామి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తారు. స్వామి వారికి బోనం మొక్కులు చెల్లించుకుంటారు. పట్నాలు వేసి స్వామిని ప్రసన్నం చేసుకుంటారు.

కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవం ఈ నెల 14న ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీ రాత్రి నుంచి 14వ తేదీ ఉదయం వరకు కొమురవెళ్లి మల్లికార్జున స్వామి (Komuravelli Mallikarjuna Swamy) మూల విరాట్ దర్శనాలు నిలిపి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కల్యాణ మహోత్సవం కోసం పంచ రంగులతో అలంకరణ నేపథ్యంలో దర్శనాలు బంద్ చేసినట్లు తెలిపారు. ఉత్సవ విగ్రహాన్ని దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

కాగా ప్రతి యేటా స్వామివారి కల్యాణం ఘనంగా జరిపిస్తారు. ఈ వేడుకకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. సంక్రాంతి అనంతరం మల్లన్న క్షేత్రంలో జాతర ఘనంగా సాగనుంది. రెండు నెలల పాటు జరిగే ఈ జాతర కోసం అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు.

Komuravelli Mallanna | సంక్రాంతి తర్వాత..

సంక్రాంతి తర్వాత తొలి ఆదివారం కొమురవెల్లి జాతర ప్రారంభం అవుతంది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర (Maharashtra), కర్ణాటక (Karnataka) నుంచి వేలాదిగా తరలివచ్చే తరలి వస్తారు. ఉగాది ముందు వచ్చే ఆదివారంతో జాతర ముగుస్తుంది. సుమారు రెండున్నర నెలల పాటు సాగే జాతరలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బోనాలు, పట్నాలతో మల్లన్నకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.

Must Read
Related News